విశాఖపట్నంలో జరిగే సీఐటీయూ జాతీయ మహాసభల బహిరంగ సభకు పరవాడ మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి కార్మికులు ఆదివారం తరలి వెళ్లారు. పరవాడ పోలీస్ స్టేషన్ ఎదుట వాహనాలను సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. లేబర్ కోడ్స్ రద్దు వరకు పోరాటం సాగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.