బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని బుచ్చయ్యపేట గ్రామ శివారులో ఉన్న చెరుకు కాటా వద్ద ఆదివారం పోలీసులు గంజాయి రవాణాను భగ్నం చేశారు. ఒరిస్సా రాష్ట్రం నుండి అక్రమంగా తరలిస్తున్న 3 కేజీల గంజాయి కలిగిన ఒక తెల్లటి మూటను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని అనకాపల్లి గవరపాలెం ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తరలిస్తుండగా గమనించిన పోలీసులు వారిని పట్టుకున్నారు. నిందితులపై గంజాయి కేసు నమోదు చేసి, తదుపరి చర్యల నిమిత్తం చోడవరం కోర్టులో రిమాండ్‌కు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ మత్తు పదార్థాల రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్ ఐ శ్రీనివాస్ హెచ్చరించారు.