వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో అరెస్టు అనంతరం ఆ దేశ పరిపాలనా బాధ్యతలను తామే చేపడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అధికార బదిలీ సురక్షితంగా జరిగే వరకు వెనెజువెలాను పర్యవేక్షిస్తామని తెలిపారు. అస్తవ్యస్తమైన చమురు వ్యాపారాన్ని చక్కదిద్దేందుకు అమెరికా కంపెనీలు అక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తాయని వెల్లడించారు. మదురో అరెస్టుతో వెనెజువెలా ప్రజలకు స్వేచ్ఛ లభించిందని ట్రంప్ పేర్కొన్నారు.