కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండలంలోని కోట పరందోలి–బిడ్వర్‌లో కొలువై ఉన్న ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి దేవస్థానంను మాజీ ఎంపీ, రాజ్ గొండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, కాలి నడకన గుహలో కొలువై ఉన్న జంగుబాయి దైవానికి పూజలు చేశారు. తదుపరి శంకర్ లొద్ది వద్ద ఉన్న శివలింగానికి అభిషేకం చేసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.