నిర్మల్ మున్సిపాలిటీ ముసాయిదా ఓటర్ లిస్ట్‌ను తీవ్ర తప్పులతో రూపొందించారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు మున్సిపల్ కమిషనర్‌ను కలిసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామాల ఓటర్లను నిర్మల్ పట్టణ వార్డుల్లో చేర్చడం, అలాగే సంబంధం లేని వర్గాల ఓట్లను హిందూ మెజారిటీ వార్డుల్లో అక్రమంగా నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ లోపాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు అంజు కుమార్ రెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ గాదె విలాస్ మున్సిపల్ కమిషనర్‌ను కలిసి ఓటర్ లిస్టులో జరిగిన లోపాలను వివరించారు. తప్పుల సవరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.