జగన్‌కు దేవుడంటే లెక్కలేదు: చంద్రబాబు
NEWS Dec 06,2025 07:37 pm
AP: వైసీపీ పాలనలోనే నేరస్థులు తయారయ్యారని సీఎం చంద్రబాబు విమర్శించారు. రౌడీ షీటర్లు, లేడీ డాన్ల తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు. మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ జగన్‌కు దేవుడు, ఆలయాల పవిత్రత అంటే లెక్కలేదని మండిపడ్డారు. బాబాయ్ హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన ఆయన పరకామణి చోరీ కేసునూ సెటిల్ చేయాలని చూశారని ఆరోపించారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.