హైదరాబాద్‌లో ATA సాహిత్య సదస్సు
NEWS Dec 06,2025 01:38 pm
HYD: సురవరంప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ లో డిసెంబర్ 14న ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు జరగనుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్య సమాలోచనతో ATA తెలుగేతర సాహిత్యాన్ని పరిచయం చేస్తూ కొత్త ఒరవడిని ప్రారంభిస్తోంది. హిందీ సాహితీవే త్తలు శుక్లా సాహిత్యాన్ని తెలుగు సాహితీ లోకానికి పరిచయం చేస్తారు. ATA అధ్యక్షులు జయంత్ చల్లా, ATA డేస్ చైర్ సతీష్ రెడ్డి పర్యవేక్షణలో, వేణు నక్షత్రం సమన్వయంతో జరిగే వేడుకకు సాహితీవేత్తలను ATA ఆహ్వానిస్తోంది.