మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట మార్చారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని అనలేదని అన్నారు. ఓ మీడియా మిత్రుడు అడిగితే చెప్పానన్నారు. దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలు ఓపెన్ చేస్తానని చెప్పాను తప్ప రాజకీయాలను వదిలేస్తా అని అనలేదని పేర్కొన్నారు. జపాన్ లో రిటైర్‌మెంట్ అనేది ఉండదన్నారు. తాను కూడా ఇప్పట్లో తప్పుకునే ప్రసక్తి లేదన్నారు మల్లారెడ్డి.