తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ
NEWS Aug 10,2025 12:08 pm
తెలంగాణ రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది తెలంగాణ వాతావరణ సంస్థ. హైదరాబాద్ తో పాటు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నాగర్ కర్నూల్, సిద్ధిపేట, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం జిల్లాలో వానలు పడతాయని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 14 నుంచి 17 వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హచ్చరించింది.