ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికులు ఆందోళన చేపట్టారు. వేతనాలు పెంచాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. 24 యూనియన్లకు చెందిన సినీ కార్మికులు పాల్గొన్నారు. నిర్మాతలు, కార్మిక సంఘాలకు మధ్య జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. మూడు కేటగిరీలుగా విభజించి, కార్మికుల వేతనాల్ని పెంచాలని నిర్మాతలు నిర్ణయించారు. కాగా నిర్మాతల నిర్ణయంపై కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. దీనిని నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు.