పి శివశంకర్ కు ఘనంగా నివాళి
NEWS Aug 10,2025 11:38 am
బహుజనుల బాంధవుడిగా పేరు పొందిన దివంగత మాజీ కేంద్ర మంత్రి పి. శివ శంకర్ జయంతి. ఈ సందర్బంగా ఆయన చిత్ర పటానికి కాంగ్రెస్, బీసీ నేతలు నివాళులు అర్పించారు. తన జీవిత కాలంలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు శివ శంకర్. కేంద్ర మంత్రిగా, గవర్నర్ గా, జాతీయ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా తనదైన ముద్ర కనబరిచారు. న్యాయ శాఖ మంత్రిగా దేశ న్యాయ వ్యవస్థలో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టారు.