దశల వారీగా సినీ కార్మికుల వేతనాల పెంపు
NEWS Aug 10,2025 07:39 am
నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులతో ప్రొడ్యూసర్స్ గిల్డ్ బాధ్యులు జరిపిన సమావేశం కొలిక్కి వచ్చింది. సినీ కార్మికుల వేతనాలపై నిర్మాతల కీలక ప్రతిపాదనలు చేశారు. మూడు విడతల్లో వేతనాల పెంపునకు అంగీకారానికి వచ్చారు. తొలి ఏడాది 15 శాతం, రెండు, మూడో ఏడాదిలో 5 శాతం చొప్పున పెంచేందుకు ఒప్పుకున్నారు. రూ.2 వేల లోపు ఉన్న వారికి మొదటి ఏడాది 15 శాతం పెంచాలని, రూ. వేయి లోపు ఉన్న వారికి 20 శాతం పెంచాలని నిర్ణయించారు. చిన్న సినిమాలకు పాత వేతనాలే కొనసాగుతాయని నిర్మాతలు స్పష్టం చేశారు.