బంగారుమెట్టలో రాఖీ పండగ సంబరాలు
NEWS Aug 09,2025 05:13 pm
బుచ్చయ్యపేట మండలం, బంగారుమెట్ట గ్రామంలో సోదరీ సోదరుల ఆత్మీయ బంధాన్ని ప్రతిబింబిస్తూ రాఖీ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఆరిపాక అర్జున కుటుంబంలో సోదరీమణులైన దేవుడమ్మ, గణేష్ అమ్మ, పైడితల్లమ్మలు తమ సోదరులైన ఆరిపాక జగన్, రమేష్‌లకు రాఖీ కట్టి, వారు ఆయురారోగ్యాలతో జీవితాంతం సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదించారు. ప్రేమ, ఐక్యతకు స్ఫూర్తిగా నిలిచిన ఈ వేడుక గ్రామంలో ఆనందోత్సాహాలను నింపింది.