మెట్‌పల్లి పట్టణ ప్రాంతంలోని న్యూ బస్టాండ్ నుండి పోలీస్ స్టేషన్ మధ్యలో 2 వీలర్ వెహికల్ సైలెన్సర్ లేకుండా అధిక శబ్దంతో తిరుగుతున్న మైనర్ బాలుడుని పట్టుకుని, వెహికల్‌ని స్వాధీనం చేసుకొని విచారణ చేసి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కి అప్పజెప్పనట్టు మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్ తెలిపారు. మెట్‌పల్లి పట్టణ ప్రాంతంలో మైనర్‌లకు వెహికల్ ఇచ్చే తల్లిదండ్రుల మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.