ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న జగిత్యాల రూరల్ మండలం పొలాసకు చెందిన పడాల దినేష్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు DSP రఘుచందర్ తెలిపారు. నిందితుని వద్ద 9 ద్విచక్ర వాహనాలు స్వాదీనం చేసుకున్నామన్నారు. ద్విచక్ర వాహన దొంగను చాకచక్యంగా పట్టుకున్నందుకు జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్పి.కరుణాకర్ ఎస్ఐలు రవి కిరణ్, సుప్రియ, సిబ్బందిని డిఎస్పీ అభినందించారు.