సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవిపై. కార్మికుల సమస్యలపై నిర్మాతలు చిరంజీవితో భేటీ అవ్వడం అంటే పులికి మేకని అప్పగించినట్లే నని మండిపడ్డారు. కార్మిక వర్గానికి పనిచేసే వాళ్లు చాలా మంది ఉన్నారని, వారితో కాకుండా చిరంజీవితో చర్చించడం దారుణమన్నారు. తాను గతంలో చిరంజీవిపై మాట్లాడిన వీడియోలను మళ్లీ వైరల్ చేస్తున్నారన్నారు. తనకి విజ్ఞత ఉంటే ఆ వీడియోలను తొలగించాలన్నారు.