సృష్టి స్కాం కేసులో 8 మంది అరెస్ట్
NEWS Aug 07,2025 08:28 am
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ స్కాంలో 8 మందిని అరెస్ట్ చేశారు గోపాలపురం పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు ఏజెంట్లు, పిల్లలను విక్రయించిన ముగ్గురు తల్లులు ఉన్నారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్‌లో ఎంబ్రియాలజిస్ట్‌గా పని చేస్తున్న డా.అనుశ్రీ, అనస్థీషియా డా.రవిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. ఫేక్ సరోగసి కేసులో తల్లిదండ్రులను గుర్తించేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు.