యాక్టర్ విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈడీ ముందు విచారణ అనంతరం మాట్లాడాడు. తాను చేసింది లీగల్ గేమింగ్ యాప్ కు ప్రమోషన్ చేయడం జరిగిందన్నారు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయలేదన్నారు. ముందు ఈ రెండిటికి తేడా తెలుసుకొని ప్రసారం చేయాలన్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కూడా విచారణ జరుగుతోందన్నారు. కానీ నన్ను పిలిచింది గేమింగ్ యాప్ ప్రమోషన్ కేసు విచారణ కోసం అన్నారు. బ్యాంక్ లావాదేవీలు సహా అధికారులు అడిగిన సమాచారమంతా ఇచ్చానని చెప్పారు.