మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం పోస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఆ పదవిపై మోజు లేదన్నారు. తనకు తలనొప్పులు తెచ్చుకోవడం ఇష్టం లేదన్నారు. ప్రత్యేకించి పదవుల మీద వ్యామోహం లేదన్నారు. తాను ఏనాడూ తనకు పదవి కావాలని అడిగింది లేదని పేర్కొన్నారు. తమ కుటుంబమంతా ప్రజల కోసం పని చేయడం తప్పా వేరే ధ్యాస లేదన్నారు.