బిల్లులు చెల్లించాలంటూ కలెక్టర్‌కు వినతి
NEWS Aug 05,2025 02:29 pm
మల్లాపూర్: జగిత్యాల జిల్లాలో మన ఊరు-మనబడి కార్యక్రమం కింద చేసిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కలెక్టర్‌కు మల్లాపూర్‌లో SMC చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, చిన్న కాంట్రాక్టర్‌లు వినతి పత్రం అందించారు. బిల్లులు రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, చాలా మంది రోడ్డున పడే పరిస్థితి ఉందన్నారు. ఆగష్టు 15లోపు తమకు బిల్లులు చెల్లించకపోతే నిరసనలు తీవ్రతరం చేపడతామని హెచ్చరించారు.