భారతీయుడు ఎవరనేది సుప్రీంకోర్టు నిర్ణయించదు
NEWS Aug 05,2025 02:04 pm
ఎంపీ ప్రియాంక గాంధీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సోదరుడు , ఎంపీ రాహుల్ గాంధీ గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై తీవ్రంగా స్పందించారు ప్రియాంక గాంధీ. రాహుల్ నిజమైన భారతీయుడు అనే ప్రశ్నలను సుప్రీంకోర్టు లేవనెత్తడాన్ని తప్పు పట్టారు. న్యాయమూర్తులంటే తనకు గౌరవం ఉందని, నిజమైన ఇండియన్ ఎవరనేది సుప్రీంకోర్టు నిర్ణయించదని, ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు. .