తన కోడలు ఉపాసన కొణిదలకు కీలక పదవి అప్పగించింది తెలంగాణ సర్కార్. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కు వైస్ చైర్ పర్సన్ గా నియమించింది. ఈ సందర్బంగా సంతోషం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. కోడలికి కొత్త పదవి రావడం పట్ల ఆనందంగా ఉందన్నారు. ఇది గౌరవంతో పాటు గొప్ప బాధ్యత అని పేర్కొన్నారు. కాగా తెలంగాణ వాదులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మెగా ఫ్యామీలికి తెలంగాణకు ఏం సంబంధం అంటూ ప్రశ్నిస్తున్నారు.