కేసీఆర్ చండీ యాగం అబద్దం
NEWS Aug 05,2025 08:05 am
బీఆర్ఎస్ కీలక ప్రకటన చేసింది. కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో చండీ యాగం నిర్వహిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్దమని పేర్కొంది. కేసీఆర్ ఆఫీస్ నుంచి కానీ, పార్టీ కార్యలయం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదని స్పష్టం చేసింది. సమాచారం తెలుసుకోకుండా , వాస్తవాలు నిర్ధారించు కోకుండా తమ ఇష్టం వచ్చిన రీతిలో తప్పుడు ప్రచారం చేయడం మంచి పద్దతి కాదని పేర్కొంది. తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే విధంగా, కేసీఆర్ గారి ప్రతిష్ఠను భంగపరిచే విధంగా కొనసాగిస్తున్న అవాస్తవాలకు చెక్ పెట్టాలని కోరింది.