హైదరాబాద్‌లో భారీ వర్షం.. ట్రాఫిక్ స్తంభించిన మహానగరం
NEWS Aug 04,2025 05:55 pm
హైదరాబాద్‌లో సోమవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. ఉప్పల్, రామంతాపూర్, పంజాగుట్ట, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. నాలాలు పొంగిపొర్లుతుండగా, జీహెచ్ఎంసీ, హైడ్రా ఎమర్జెన్సీ టీమ్స్ అప్రమత్తమయ్యాయి. బంజారాహిల్స్‌లో చెట్టు కూలి కారుపై పడగా, సహాయక చర్యలు జరుగుతున్నాయి. అత్యవసరం లేకుంటే బయటకు రావొద్దని హైడ్రా హెచ్చరించింది.