ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు
NEWS Aug 04,2025 04:08 pm
తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్‌కు ఉపాసన కొణిదెల కో-ఛైర్మన్‌గా నియామకం అయ్యారు. క్రీడా రంగాలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం నియమించిన ఈ బోర్డుకు ఛైర్మన్‌గా సంజయ్ గోయెంకా ఉన్నారు. తెలంగాణను ప్రపంచ క్రీడా శక్తిగా మార్చేందుకు కృషి చేస్తానని, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఉపాసన కొణిదల. ఆమె రామ్ చరణ్ భార్య. తన తాత అపోలో సంస్థల అధినేత.