హైదరాబాద్ లో భారీ వర్షం
NEWS Aug 04,2025 04:00 pm
హైదరాబాద్ లో ఉన్నట్టుండి భారీగా వర్షం కురిసింది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఉప్పల్, పంజాగుట్టా, గచ్చిబౌలి, ఎస్ఆర్ నగర్, కూకట్ పల్లి, తదితర ప్రాంతాల్లో దంచి కొట్టింది. ఎక్కడ చూసినా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచి పోయాయి. ట్రాఫిక్ స్తంభించి పోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.