చంద్రబాబు నాయుడు ప్రోగ్రెసివ్ సీఎం
NEWS Aug 04,2025 03:40 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన గురు భక్తిని అవసరమైన ప్రతి చోటా చాటుకుంటున్నారు. తాజాగా జాతీయ మీడియాతో జరిగిన చర్చలో మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. సిస్టమ్ ఎలా నడపాలి? అధికారులతో ఎలా పని చేయించుకోవాలి అనేది తన నుంచి నేర్చుకున్నానని, ఆయన ప్రోగ్రెసివ్ సీఎం అంటూ కితాబు ఇచ్చారు. దేశంలో కేవలం విజన్ కలిగిన నాయకుడు బాబేనంటూ పేర్కొన్నారు.