గ్లోబల్ జీసీసీ హబ్ గా హైదరాబాద్
NEWS Aug 04,2025 02:47 pm
కేవలం అతి తక్కువ 20 నెలల కాలంలోనే గ్లోబల్ జీసీసీ హబ్ గా హైదరాబాద్ నిలిచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మారిందనన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను సాధించడానికి, ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని సాధించడానికి జిసిసి వృద్ధి ఒక ముఖ్యమైన అడుగు అని స్పష్టం చేశారు. దీని వెనుక మంత్రి శ్రీధర్ బాబు కృషి కూడా ఉందని ప్రశంసించారు. రాబోయే కాలంలో వేలాది మందికి ఉపాధి లభిస్తుందన్నారు.