ఏపీలో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు
NEWS Aug 04,2025 10:10 am
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తర తమిళనాడుకు నైరుతి దిశగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో మూడు రోజులు పల్నాడుతో పాటు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన అన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.