జాబ్ మేళాకు విశేష స్పందన
NEWS Aug 03,2025 11:35 pm
ములుగు జిల్లా కేంద్రంలో సి ఎస్ సి హెల్త్ కేర్ ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి తుల రవి నిర్వహించిన జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులు తగిన అర్హత పత్రాలతో హాజరయ్యారు. ఎం ఎల్ టి, డి ఎం ఎల్ టి, బీఎస్సీ నర్సింగ్, జిఎన్ఎమ్, ఎం పి హెచ్ డబ్ల్యు లకు సంబంధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ సి హెల్త్ కేర్ జిల్లా కోఆర్డినేటర్లు, మండల కోఆర్డినేటర్లు, జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారులు పాల్గొన్నారు.