రష్యా ఆయిల్‌పై ట్రంప్ వ్యాఖ్యలు.. తోసిపుచ్చిన భారత్
NEWS Aug 02,2025 12:16 pm
రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోళ్లను నిలిపివేసిందంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. అయితే, ఈ ప్రచారాన్ని భారత ప్రభుత్వ వర్గాలు శనివారం తీవ్రంగా ఖండించాయి. రష్యా నుంచి చమురు దిగుమతులు ఆగలేదని, యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశాయి.
వాషింగ్టన్‌లో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ, "రష్యా నుంచి భారత్ ఇకపై చమురు కొనడం లేదని నేను విన్నాను. అది నిజమో కాదో నాకు తెలియదు. కానీ, అదే జరిగితే మంచి పరిణామం" అని పేర్కొన్నారు.