బలగం పాటకు దక్కిన గౌరవం
NEWS Aug 02,2025 07:23 am
జాతీయ స్థాయిలో ఉత్తమ గేయ రచయితగా బలగం చిత్రంలోని పాటకు తనను ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు కాసర్ల శ్యాం. బలగం డైరెక్టర్ వేణు, నిర్మాతలు దిల్ రాజు, హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, సంగీత దర్శకులు భీమ్స్, గాయకులు రామ్ మిరియాల, మంగ్లీని మరిచి పోలేనని పేర్కొన్నాడు. భవిష్యత్తులో మరిన్ని మంచి పాటలు రాసేందుకు ప్రయత్నం చేస్తానని తెలిపాడు కాసర్ల శ్యామ్.