జగన్ వ్యాఖ్యలకు ఎంపీ అప్పలనాయుడు కౌంటర్ ఇచ్చారు. పర్యటనలతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పోలీసులను హెచ్చరించడం మంచి పద్దతి కాదన్నారు. జగన్ కు జైలు కొత్త కాదన్నారు. ఒకవేళ తను అరెస్ట్ అయితే కూడా చంద్రబాబు కావాలనే చేయించారని అంటారని ఎద్దేవా చేశారు.