జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రేసులో నేనున్నా
NEWS Jul 17,2025 05:49 pm
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల రేసులో తాను కూడా ఉన్నానని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్. తనకు అన్యాయం జరగదని ఇప్పటికే హైకమాండ్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. తన కొడుకు కష్ట పడినందుకే ఎంపీ టికెట్ ఇచ్చారని అన్నారు. తండ్రీ కొడుకులం పార్టీ కోసం సేవలు చేస్తున్నామని, కానీ జీతం మాత్రం ఒక్కరికే ఇస్తున్నారంటూ వాపోయారు. బీసీ సామాజిక వర్గం నుంచి తనకు టికెట్ ఇవ్వాలని లేక పోతే బాగుండదన్నారు.