గాంధీ, శాస్త్రి ఆశయాలు స్ఫూర్తిదాయకం
NEWS Oct 02,2026 09:15 pm
అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీ జయంతి, లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీఎస్పీ ఈ.శ్రీనివాసులు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీ అహింస, సత్యం, శాస్త్రి నిరాడంబరత, నిజాయితీ ఆదర్శనీయమన్నారు. కార్యక్రమంలో సీఐలు బాలసూర్యారావు, చంద్రశేఖర్, ఎస్సై మనోజ్‌కుమార్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.