జూనియర్ కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి
NEWS Jul 17,2025 05:50 pm
నిర్మల్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కళాశాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు.