కేటీఆర్ ది గంజాయి బ్యాచ్ - సీఎం
NEWS Jul 17,2025 04:55 pm
బీజేపీ నేతలకు దమ్ముంటే గుజరాత్, యూపీ, మహారాష్ట్రలో అమలవుతున్న ముస్లిం రిజర్వేషన్లను తీసివేసిన తర్వాత తెలంగాణలో తీసేయమని అడగాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేటీఆర్ ది గంజాయి బ్యాచ్ అని ఆరోపించారు. కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారని అన్నారు. తన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. డ్రగ్స్ టెస్టుకు రమ్మంటే పారిపోయింది ఎవరు అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కేటీఆర్ పార్టనర్, ఫ్రెండ్ కేదార్ మిక్స్‌డ్ డ్రగ్స్ తీసుకుని దుబాయ్ లో చనిపోయాడని, దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టు కూడా నేను తెప్పించానని చెప్పారు.