ఐటీ సీటు సాధించిన మధురిమ కు ఘన సన్మానం
NEWS Jul 17,2025 05:51 pm
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన దువ్వ మధురిమ బాసరలో త్రిబుల్ ఐటీ లో సీటు సాధించడం పట్ల చిట్టాపూర్ గ్రామానికి చెందిన విద్యావంతులు హర్షం వ్యక్తం చేస్తూ శాలువాతో సత్కరించారు. నేటి విద్యార్థులు మధురిమను ఆదర్శంగా తీసుకొని విద్యను అభ్యసించాలని, తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు తీసుకు రావాలని పేర్కొన్నారు.