నటి రమ్యా రావుకు ఏడాది జైలు శిక్ష
NEWS Jul 17,2025 01:00 pm
బంగారం స్మగ్లింగ్ కేసులో నటి రమ్యా రావుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఏడాది జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. దర్యాప్తులో రమ్యా తన భాగస్వామి తరుణ్ తో కలిసి దుబాయ్ లో ఒక వజ్రాల కంపెనీ స్థాపించారు. ఇండియాలోకి బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు ఒక వేదికగా ఉపయోగించుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. పూర్తి నివేదికను కోర్టులో సమర్పించడంతో కీలక తీర్పు వెలువరించింది.