కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టే - కవిత
NEWS Jul 17,2025 11:10 am
ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పై. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ కరెక్టేనని అన్నారు. బీఆర్ఎస్ వాళ్లు ఆర్డినెన్స్ వద్దని చెబుతున్నారని, అది పూర్తిగా తప్పన్నారు. వాళ్లు కూడా నా దారికి రావాల్సిందేనని అన్నారు. నాలుగు రోజులు టైం తీసుకుంటారంతేనని పేర్కొన్నారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం ముమ్మాటికీ సబబేనని స్పష్టం చేశారు. తాను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే మద్దతు ఇచ్చానని చెప్పారు.