జగన్ పాలిటిక్స్ కు పనికిరాడు
NEWS Jul 17,2025 09:29 am
పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హెచ్ డీ నల్లబెర్లీ పొగాకు రైతులు నష్ట పోకూడదని దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టిందన్నారు. ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏపీని తన అసమర్థ పాలనతో 25 ఏళ్లు వెనక్కి తీసుకు వెళ్లాడని జగన్ పై ధ్వజమెత్తారు.