భారీ వర్షాలు.. అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
NEWS Jul 17,2025 09:05 am
గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పహల్గామ్, బాల్తాల్ బేస్ క్యాంపుల నుంచి అమర్‌నాథ్ యాత్రను గురువారం నిలిపివేసినట్లు జమ్మూ కాశ్మీర్ సమాచార శాఖ ప్రకటించింది.కుండపోత వర్షం కారణంగా ప్రభావితమైన యాత్రా స్థలాలలో అధికారులు అత్యవసర పునరుద్ధరణ పనులు చేపడుతున్న నేపథ్యంలో యాత్రను ఒకరోజు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.