కనిగిరి మున్సిపాలిటీ పరిధిలోని పులి వెంకటరెడ్డి పార్క్ ను కనిగిరి మున్సిపల్ కమిషనర్ పి కృష్ణ మోహన్ రెడ్డి గురువారం ఉదయం సందర్శించారు. పార్కులో పారిశుధ్యం, వ్యాయామ పరికరాలు పరిశీలించారు. నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యమైన జీవితాన్ని అనుభవించవచ్చునని ఆయన తెలియజేశారు. వ్యాయామానికి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.