మోడల్ స్కూల్ తనిఖీ చేసిన కలెక్టర్
NEWS Jul 17,2025 06:58 am
నారాయణపేట జిల్లా ధన్వాడ మోడల్ స్కూల్ ను కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సంఖ్య వారికి అందిస్తున్న మధ్యాహ్న భోజనంపై ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రంగా ఉంచాలని, పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని ఎంపీడీవోను ఆదేశించారు. పాఠశాలలో వంటగది లేకపోవడం గమనించి వంట గది ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థుల మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు.