ఫుల్ టైమ్ హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుందో చూస్తున్నాం: కేటీఆర్ ఫైర్
NEWS Jul 16,2025 10:45 am
నిన్న హైదరాబాద్ లోని మలక్ పేట్ లో సీపీఐ నేత చందునాయక్ ను దుండగులు తుపాకీతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. మరోవైపు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేత, పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి అనిల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.