శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి షురూ
NEWS Jul 16,2025 08:36 am
శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఇన్ ఫ్లో 57,851 క్యూసెక్కులు ఉండగా , ఔట్ ఫ్లో 68,247 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 881.80 అడుగులు ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 197.9120 టీఎంసీల వద్ద నీరుంది. భారీ ఎత్తున నీళ్లు ఉండడంతో శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.