సుంకేసుల ప్రాజెక్టు 7 గేట్లు ఎత్తివేత
NEWS Jul 16,2025 08:31 am
సుంకేసుల జలాశయంకు కొనసాగుతోంది వరద ప్రవాహం. భారీగా నీరు చేరుతుండడంతో 7 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 32 వేల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 28 వేల 952 క్యూసెక్కులుగా ఉంది. సుంకేసుల నుంచి కర్నూల్ కడప కెనాల్ కు 2300 క్యూసెక్కుల నీళ్లను వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 1.2 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 0.645 టీఎంసీలుగా ఉంది.