హీరో రవితేజ తండ్రి కన్నుమూత
NEWS Jul 16,2025 08:12 am
ప్రముఖ హీరో రవి తేజ ఇంట్లో విషాదం అలుముకుంది. తన తండ్రి రాజ గోపాల్ రాజు హైదరాబాద్ లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 90 ఏళ్లు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవలే సినిమా షూటింగ్ సందర్బంగా కలిశారని, అంతలోనే ఇలా జరుగతుందని తాను అనుకోలేదన్నారు. రాజ గోపాల్ రాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.