నల్లగొండలో ఫార్మా, లా కాలేజీ ఏర్పాటు చేస్తా
NEWS Jul 16,2025 07:15 am
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. నల్లగొండలో ఫార్మా కాలేజీతో పాటు లా కాలేజీ ఏర్పాటు చేయాలన్నది తన కల అన్నాడు. నల్లగొండ జిల్లా అభివృద్దిపై మంత్రి సమీక్ష చేపట్టారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాలేజీ, స్కూల్ ఎడ్యుకేషన్ పై చర్చించారు. ఈ కీలక సమావేశంలో విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా , ఉన్నత విద్యా కమిషనర్ దేవసేన, వీసీ అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ రవి హాజరయ్యారు.