ఒలింపిక్స్-2028 షెడ్యూల్ విడుదల
NEWS Jul 16,2025 07:11 am
2028లో జరిగే ఒలింపిక్స్ కు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. అమెరికా లోని లాస్ ఏంజిల్స్ వేదికగా ఈ పోటీలు జరగనున్నాయి. 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్ లో చోటు దక్కించుకుంది క్రికెట్ . ఇందులో భాగంగా జూలై 12 నుంచి 18 వరకు, జూలై 22 నుంచి 28 వరకు రెండు సెగ్మెంట్ లలో గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లు జరుగుతాయి. జూలై 19న పురుషులు, జూలై 29న మహిళలకు సంబంధించి సెమీ ఫైనల్, మెడల్ మ్యాచ్ లు జరుగుతాయి. ఒక్కో జట్టులో 15 మందితో కూడిన సభ్యులు ఉంటారు.